జ్ఞానవేల్ దర్శకత్వంలో సూర్య నటించిన ‘జైభీమ్’ ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత ఈ సినిమా సీక్వెల్ పై సినీ అభిమానులు చర్చించకున్నా అటు దర్శకుడు, ఇటు నిర్మాత రాజశేఖర్ ఎప్పుడూ స్పందించలేదు. ఇటీవల గోవాలో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్ లో దీనిపై దర్శక నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. ‘జస్టిస్ చంద్రు వాదించిన కేసుల్లో ఒకదాన్ని తీసుకుని జైభీమ్ తీశాం. ఆయన వాదించిన మరిన్ని కేసులతో సీక్వెల్ తియ్యొచ్చు.’ అని అన్నారు. దీంతో ‘జైభీమ్’ సీక్వెల్ తీసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోందని అభిమానులు చర్చించుకుంటున్నారు.