కోలీవుడ్ హీరో విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి జంటగా, డైరెక్టర్ చెల్లా అయ్యావు తెరకెక్కించిన స్పోర్ట్స్ బేస్డ్ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ "మట్టి కుస్తీ". తమిళంలో "గట్టకుస్తి". మాస్ రాజా రవితేజ, విష్ణు విశాల్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. పోతే, డిసెంబర్ 2న అంటే ఈ శుక్రవారం తెలుగు, తమిళ భాషలలో మట్టి కుస్తీ/ గట్ట కుస్తీ రిలీజ్ కాబోతుంది.
తాజాగా మేకర్స్ ఈ సినిమా థర్డ్ సింగిల్ రిలీజ్ అప్డేట్ ఇచ్చారు. ఈ మేరకు ఈ రోజు సాయంత్రం ఆరింటికి థర్డ్ సింగిల్ 'తన్నే చిన్నది' లిరికల్ సాంగ్ విడుదల కాబోతుందని తెలుపుతూ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa