ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లేటెస్ట్ ... రాంచరణ్ అప్ కమింగ్ మూవీ అప్డేట్ రేపు రాబోతుందోచ్ ..!!

cinema |  Suryaa Desk  | Published : Sun, Nov 27, 2022, 03:00 PM

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రెజెంట్ RC 15 షూటింగ్ లో బిజీగా ఉన్నారు. RRR గ్లోబల్ హిట్ తదుపరి ఆచార్య డిజాస్టర్ అందుకున్న చెర్రీ ఈ సినిమాతో తిరిగి పాన్ ఇండియా సెన్సేషనల్ హిట్ కొట్టాలనే కసితో పనిచేస్తున్నారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.


తాజా సమాచారం ప్రకారం, రాంచరణ్ అప్ కమింగ్ మూవీ నుండి ఒక సర్ప్రైజింగ్ అప్డేట్ రేపు ఉదయం 11:11 నిమిషాలకు రాబోతుందని తెలుస్తుంది. మరి ఈ బ్లాస్టింగ్ అప్డేట్ శంకర్ డైరెక్షన్లో రూపొందుతున్న RC 15 గురించా లేక ఫుల్ కన్ఫ్యూషన్ నెలకొన్న RC 16 మూవీ గురించా అన్నది రేపు కానీ రివీల్ కాదు. మరైతే, ఈ అప్డేట్ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa