సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో పన్నెండు సంవత్సరాల తరవాత ఒక భారీ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే కదా. ఈ మేరకు ఆల్రెడీ ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది. సెకండ్ షెడ్యూల్ త్వరలోనే స్టార్ట్ కానుంది.
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ శోభన గారు కీరోల్ లో నటించబోతున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతుంది. మరి, ఈ విషయంలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.
పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa