మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న కొత్త చిత్రం "వాల్తేరు వీరయ్య". శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా నుండి రీసెంట్గానే బాస్ పార్టీ ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజై చార్ట్ బస్టర్ గా నిలిచింది. వింటేజ్ లుక్ లో చిరు వేసే గ్రేస్ ఫుల్ స్టెప్స్, DSP పెప్పీ ట్యూన్, ఊర్వశి రౌతెలా గ్లామర్... తో ఈ పాట ఆడియన్స్ కు ఫుల్ కిక్ ఇస్తుంది. దీంతో యూట్యూబులో బాస్ పార్టీ సాంగ్ క్రేజ్ రోజురోజుకూ పెరిగిపోతుంది. ఇప్పటికి ఈ పాట 13 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ టాప్ ట్రెండింగ్లో దూసుకుపోతుంది.
బాబీ ఈ సినిమాకు దర్శకుడు కాగా, మాస్ రాజా రవితేజ కీలకపాత్రలో నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa