చిన్న సినిమాగా విడుదలై, కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మెరుపులు మెరిపిస్తున్న 'లవ్ టుడే' నిన్ననే తెలుగులో విడుదలైంది. ప్రదీప్ రంగనాధన్ డైరెక్షన్లో ఫన్నీ అండ్ ఎమోషనల్ మోడరన్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకులు ఫుల్ ఫిదా అవుతున్నారు. చూసిన ప్రతి ఒక్కరూ పాజిటివ్ రివ్యూలను ఇస్తున్నారు. IMDB లో 8.7, బుక్ మై షో లో 9.6, గూగుల్ లో 97% రేటింగ్స్ తో లవ్ టుడే సినిమా ఇరు తెలుగు రాష్ట్రాలలో పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ వీకెండ్ కి లవ్ టుడే కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది.
ప్రదీప్ రంగనాధన్, ఇవానా జంటగా నటించిన ఈ సినిమాలో సత్యరాజ్, రాధికా శరత్ కుమార్, యోగిబాబు కీలకపాత్రల్లో నటించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa