యంగ్ హీరోహీరోయిన్లు యష్ పూరి, స్టెఫీ పటేల్ జంటగా నటిస్తున్న చిత్రం "చెప్పాలని ఉంది". ఈ సినిమా యష్ పూరికి ఫస్ట్ సినిమా కాగా, స్టెఫీకి రెండో సినిమా. 2019లో వచ్చిన నిన్ను తలచి సినిమాలో స్టెఫీ తొలిసారిగా హీరోయిన్ గా నటించింది.
లేటెస్ట్ గా ఈ సినిమా నుండి సెకండ్ సింగిల్ ప్రోమో రిలీజ్ అయ్యింది. "నీ కోసం నేనే కదిలాక" అనే ఈ పాట హీరోహీరోయిన్ల మధ్య డ్యూయెట్ సాంగ్ లా ఉంది. ఫుల్ సాంగ్ రేపు రిలీజ్ కాబోతుంది.
ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై 94వ ప్రాజెక్ట్ గా రాబోతున్న ఈ సినిమాను అరుణ్ భారతి డైరెక్ట్ చేస్తున్నారు. అస్లాం కెయి సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa