అల్లరి నరేష్, ఆనంది జంటగా నటించిన "ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం" నుండి ఈ రోజు ఉదయం తెల్లవారే వీడియో సాంగ్ విడుదలైంది. శ్రీచరణ్ పాకాల స్వరపరిచిన ఈ పాటను సింగర్ రవిప్రకాష్ పాడగా, శ్రీమణి లిరిక్స్ అందించారు.
నిన్ననే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా పాజిటివ్ రివ్యూలను అందుకుని హిట్ టాక్ తో రన్ అవుతుంది. ఒక నార్మల్ స్కూల్ టీచర్ మారేడుమిల్లి గ్రామప్రజల క్షేమం కోరి ప్రభుత్వంతో చేసిన పోరాటమే ఈ సినిమా. దర్శకనిర్మాతల హానెస్ట్ అటెంప్ట్ ప్రేక్షకుల మెప్పు పొందుతుంది.
ఈ సినిమాకు AR మోహన్ దర్శకుడు కాగా, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa