యువనటుడు విశ్వక్ సేన్, మిథిలాపాల్కర్ జంటగా, కోలీవుడ్ డైరెక్టర్ అశ్వత్ మరిముత్తు తెరకెక్కించిన ఫన్, ఎమోషనల్ డ్రామా "ఓరి దేవుడా". థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ ఐన ఈ సినిమా నుండి ఒక్కొక్కటిగా వీడియో సాంగ్స్ విడుదలవుతున్నాయి.
ఇప్పటికే కాలేజీ సాంగ్, గుండెల్లోనా, అవుననవా వీడియో సాంగ్స్ విడుదల కాగా, తాజాగా మరచిపోలేనే సాడ్ సాంగ్ వీడియో విడుదల అయ్యింది. కధలో భాగంగా వచ్చే ఈ పాటను రవి ఆలపించగా, రామజోగయ్యశాస్త్రి గారు లిరిక్స్ అందించారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa