మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ తో కలిసి కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తున్న చిత్రం గోల్డ్. డిసెంబె 1 నుండి తమిళ, మలయాళ భాషలలో విడుదల కాబోతున్న ఈ ద్విభాషా చిత్రం నుండి నయనతార ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఇందులో సుమంగళి ఉన్నికృష్ణన్ పాత్రలో నయనతార నటిస్తున్నారు. అల్ఫోన్స్ పుత్రేన్ డైరెక్షన్లో యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాకు రాజేష్ మురుగేశన్ సంగీతం అందిస్తున్నారు. పృథ్విరాజ్ ప్రొడక్షన్స్, మ్యాజిక్ ఫ్రేమ్స్ సంయుక్తంగా నిర్మించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa