ఢిల్లీ హైకోర్టు ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ వ్యక్తిగత హక్కులపై కీలక ఆదేశాలు జారీ చేసింది. అనుమతి లేకుండా ఏ వ్యక్తి గానీ, సంస్థ గానీ ఆయన పేరు, ఫోటో, గొంతును ఉపయోగించొద్దని ఉత్తర్వులు జారీ చేసింది. వాణిజ్యపరమైన కార్యక్రమాల్లో అనుమతి లేకుండా తన పేరు, ఫోటో, వాయిస్ ఉపయోగించడాన్ని నిషేధించాలంటూ అమితాబ్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. బిగ్ బీ తరపున ప్రముఖ న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపించగా, న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కొన్ని సంస్థలు అమితాబ్ అనుమతి లేకుండా ఆయన సెలబ్రిటీ హోదాను ఉపయోగించడం ఆయనను బాధించిందని, ఇది నిషేధించకపోతే అమితాబ్ కు చెడ్డపేరు వస్తుందని కోర్టు పేర్కొంది.