విశ్వనటుడు కమల్ హాసన్ నిన్న సాయంత్రం చెన్నైలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చేరారు. స్వల్ప జ్వరం, జలుబు లక్షణాలతో కమల్ హాస్పిటల్ లో చేరినట్టు తెలుస్తుంది. డాక్టర్లు ఆయనకు చికిత్స చేసి ఈ రోజు ఉదయమే డిశ్చార్జ్ చేసారు. కొన్ని రోజులు ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకొమ్మని సజెస్ట్ చేసినట్టు తెలుస్తుంది.
ప్రస్తుతం శంకర్ RC 15 షూటింగ్ తో బిజీగా ఉండడం వల్ల ఇండియన్ 2 షూటింగ్ కొన్నిరోజులు వాయిదా పడింది. వచ్చే నెల నుండి ఇండియన్ 2 న్యూ షెడ్యూల్ స్టార్ట్ కాబోతుంది. ఆ షెడ్యూల్ లో కమల్ ఇంకా మిగిలిన నటీనటులు పాల్గొంటారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa