ఇట్లు మారేడుపల్లి ప్రజానీకం:
ఏఆర్ మోహన్ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ తన తదుపరి ప్రాజెక్ట్ ని అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసందే. ఈ సినిమాలో ఆనంది కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి 'ఇట్లు మారేడుపల్లి ప్రజానీకం' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమా నవంబర్ 25న విడుదల కానుంది. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీత అందిస్తుండగా, హాస్య మూవీస్ అండ్ జీ స్టూడియోస్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.
లవ్ టుడే:
కోమలి ఫేమ్ దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ కొత్త సినిమా 'లవ్ టుడే' విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. రొమాంటిక్ కామెడీ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమాలో ప్రదీప్ రంగనాథన్ సరసన ఇవానా జంటగా నటించారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా తెలుగు-డబ్బింగ్ వెర్షన్ నవంబర్ 25, 2022న విడుదల కానుంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. సత్యరాజ్, రాధికా శరత్‌కుమార్, యోగి బాబు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాని నిర్మించింది. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.
తోడేలు :
అమర్ కౌశిక్ దర్శకత్వంలో వరుణ్ ధావన్ 'భేడియా' సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిన విషయమే. ఈ సినిమా నవంబర్ 25, 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. కాంతారా సినిమాని తెలుగులో విడుదల చేసిన గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ఈ చిత్రాన్ని తెలుగులో 'తోడేలు' టైటిల్ తో విడుదల చేస్తుంది. ఈ సినిమాలో వరుణ్ ధావన్ సరసన జోడిగా బ్యూటీ క్వీన్ కృతి సనన్ జోడిగా నటిస్తుంది. హారర్-కామెడీ ట్రాక్ లో రానున్న ఈ చిత్రాన్ని మాడాక్ ఫిల్మ్స్ నిర్మిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa