అజయ్ దేవగణ్ నటించిన ‘దృశ్యం2’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లూ రాబడుతుంది. దృశ్యం2 ఈ నెల 18వ తేదీన విడుదలైంది. ఒక వారం కూడా పూర్తి కాకుండానే ఈ చిత్రం పలు రికార్డులను బద్దలు కొడుతోంది. ఈ చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర రూ.86 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఈ చిత్రంలో టబు, అక్షయ్ ఖన్నా, శ్రియా శరణ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఇప్పటికే భూల్ భూలాయ 2, గంగూబాయి కతియావాడి, ది కశ్మీర్ ఫైల్స్ వంటి హిట్ బాలీవుడ్ చిత్రాల తొలి వారాంతపు కలెక్షన్లను అధిగమించింది. అంతేకాదు ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచే అవకాశాలు కూడా లేకపోలేదు.