RRR సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే కొరటాల శివ డైరెక్షన్లో కొత్త సినిమాను ప్రారంభించనున్నారు. ఈ సినిమా స్టార్ట్ కావడానికి మరికొన్ని రోజులు సమయముండడంతో తారక్ ప్రస్తుతం తన మిగిలిన కమిట్మెంట్స్ పూర్తి చేస్తూ బిజీగా ఉన్నారు.
ఈ నేపథ్యంలో ఒక కమర్షియల్ యాడ్ ఒప్పుకున్న తారక్ ప్రస్తుతం ఆ యాడ్ షూట్ లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆల్రెడీ అంతకుముందు విడుదలైన న్యూహెయిర్ స్టైల్ తో ఉన్న తారక్ పిక్ వైరల్గా మారగా, తాజాగా సూటు బూటూ ధరించి కళ్ళకు కళ్లద్దాలు పెట్టిన తారక్ ఉబర్ కూల్ లుక్ ట్విట్టర్ లో ట్రెండింగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa