తేజ సజ్జా నటిస్తున్న కొత్తచిత్రం "హనుమాన్". ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో భారతదేశపు తొలి సూపర్ హీరో చిత్రంగా రూపొందిన ఈ సినిమా టీజర్ నిన్న విడుదల అయ్యింది. మైండ్ బ్లోయింగ్ విజువల్స్, పాత్రధారుల వేషధారణ, హనుమంతుడి రామ నామ స్మరణతో కూడిన ఈ టీజర్ కు పాన్ ఇండియా ప్రేక్షకులు ఫుల్ ఫిదా అవుతున్నారు. దీంతో ఈ టీజర్ యూట్యూబ్ నెంబర్ 1 ప్లేస్ ను కబ్జా చేసి ట్రెండ్ అవుతుంది. ఇప్పటివరకు యూట్యూబులో ఈ టీజర్ 8.6 మిలియన్ వ్యూస్ ను, 237 లైక్స్ ను రాబట్టింది.
అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్రలో నటిస్తుంది. వినోద్ రాయ్ విలన్గా నటిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa