నేషనల్ క్రష్ రష్మిక మండన్నా నటించిన తొలి హిందీ చిత్రం "గుడ్ బై". భారీ అంచనాల నడుమ అక్టోబర్ నెలలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పేలవ ప్రదర్శనను కనబరిచింది.
తాజాగా గుడ్ బై చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ కావడానికి రెడీ అయ్యింది. డిసెంబర్ 2 నుండి గుడ్ బై మూవీ నెట్ ఫ్లిక్స్ ఓటిటిలో స్ట్రీమింగ్ కాబోతుంది.
వికాస్ బాహ్ల్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతం అందించారు. శోభా కపూర్, ఏక్తా కపూర్ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో అమితాబ్ బచ్చన్, రష్మిక మండన్నా, నీనా గుప్త, ఆశిష్ విద్యార్థి, సునీల్ గ్రోవర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa