తాను, తన భార్య ఊహ విడాకులు తీసుకుంటున్నట్లు వస్తున్న వార్తలపై టాలీవుడ్ హీరో శ్రీకాంత్ స్పందించారు. విడాకుల పుకార్లను ఆయన ఖండించారు. తాను, ఊహ విడాకులు తీసుకుంటున్నట్లు తప్పుడు ప్రచారం జరుగుతోందని, ఇలాంటి నిరాధారమైన ప్రచారం చేయడం తప్పు అని శ్రీకాంత్ అన్నారు. పుకార్లు వైరల్ చేస్తున్న వెబ్ సైట్స్, యూట్యూబ్ ఛానెల్స్ పై శ్రీకాంత్ ఫైర్ అయ్యారు. వారిపై సైబర్ క్రైమ్ పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు.