ప్రముఖ నటుడు జేసన్ డేవిడ్ ఫ్రాంక్ (49) కన్నుమూశారు. "మైటీ మార్ఫిన్ పవర్ రేంజర్స్" షోలో తొలుత గ్రీన్ రేంజర్‌గా, తర్వాత వైట్ రేంజర్ పాత్రలో ఆయన అలరించారు. జేసన్ డేవిడ్ మరణించినట్లు ఆయన ప్రతినిధి జస్టిన్ హంట్ మీడియాకు ఆదివారం వెల్లడించారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి అంతా అండగా నిలవాలని, వారి గోప్యతను గౌరవించాలని కోరాడు. మృతికి గల కారణాలు వెల్లడి కాలేదు. ఆయన మృతికి సెలబ్రెటీలు సంతాపం తెలిపారు.