కబాలి సినిమాలో సూపర్ స్టార్ రజినీకాంత్ కు కూతురిగా నటించిన సాయి ధన్సిక ఆ సినిమాతో ప్రేక్షకుల్లో చాలా మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఇటీవలే "షికారు" తెలుగు సినిమాలో లీడ్ రోల్ లో నటించింది. తాజాగా ధన్సిక కొత్త సినిమా ప్రకటన జరిగింది.
ఈ రోజు ధన్సిక పుట్టినరోజు కావడంతో మేకర్స్ టైటిల్ తో కూడిన మోషన్ పోస్టర్ ను విడుదల చేసారు. "దక్షిణ" టైటిల్ రోల్ లో ధన్సిక నటిస్తున్న ఈ సినిమాకు ఓషో తులసీరామ్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. కల్ట్ కాన్సెప్ట్స్ బ్యానర్ పై అశోక్ షిండే నిర్మిస్తున్నారు. బాలాజీ సంగీతం అందిస్తున్నారు. నర్సింగ్ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో రిషబ్ బాబు, సుభాష్, ఆనంద భారతి నటిస్తున్నారు.
తాజాగా విడుదలైన మోషన్ పోస్టర్ లో ధన్సిక ఎగసిపడే సముద్ర అలలకు దగ్గరగా చేతిలో సిగరెట్ పట్టుకుని ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. చూస్తుంటే ఈ సినిమా యాక్షన్ ఎమోషనల్ మూవీగా తెరకెక్కనున్నట్టు తెలుస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa