అడివిశేష్ నటిస్తున్న కొత్త చిత్రం "హిట్ 2". శైలేష్ కొలను డైరెక్షన్లో క్రైమ్ మిస్టరీ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాకు సంబంధించి రీసెంట్గా టీజర్ రిలీజయ్యింది. పర్ఫెక్ట్ మర్డర్ మిస్టరీ గా ప్రేక్షకుల రోమాలను నిక్కబొడుచుకునేలా చేసింది ఈ టీజర్. దీంతో ఈ సినిమాపై చాలా మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
డిసెంబర్ 2న గ్రాండ్ రిలీజ్ కాబోతున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో ప్రమోషన్స్ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు రాత్రి ఏడింటికి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మరియు స్టార్ స్పోర్ట్స్ ఛానెల్ లో ప్రసారమయ్యే వివో ప్రో కబడ్డీ లీగ్ మ్యాచ్ లో తెలుగు టైటాన్స్ జట్టుకు సపోర్ట్ గా హిట్ 2 చిత్రబృందం రాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa