పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది చిత్రాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు తరుణ్ భాస్కర్. తర్వాత అనూహ్యంగా ఆయన దర్శకత్వానికి దూరమయ్యారు. నాలుగేళ్లు రైటర్, హీరో, క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ అయ్యారు. అనంతరం ఇప్పుడు మళ్లీ తన మూడో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ‘కీడా డోలా’ అనే వెరైటీ టైటిల్ తో పాన్ ఇండియా స్థాయిలో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దీనికి సంబధించి ఓ పోస్టర్ రిలీజ్ చేశారు.