కొంతసేపటి క్రితమే ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం నుండి కోలో కోలో కోయిలా అనే జోష్ ఫుల్ లిరికల్ సాంగ్ విడుదలైంది. మారేడుమిల్లి గ్రామ ప్రజలందరూ కలిసి ఎంతో సంతోషంతో జరుపుకునే సంబరాల నేపథ్యంలో వచ్చే ఈ పాట ఫుల్ జోష్ గా, కలర్ఫుల్ గా ఉంది. శ్రీ చరణ్ పాకాల ఈ పాటను స్వరపరచగా, జావెద్ అలీ, మోహన భోగరాజు, యామిని ఘంటసాల ఆలపించారు. కాసర్ల శ్యామ్ గారు లిరిక్స్ అందించారు. శేఖర్ మాస్టర్ డాన్స్ కొరియోగ్రఫీ చేసారు.
AR మోహన్ డైరెక్షన్లో ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం నవంబర్ 25న థియేటర్లలో విడుదల కాబోతుంది. ఇందులో అల్లరి నరేష్, ఆనంది జంటగా నటిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa