నటసింహం నందమూరి బాలకృష్ణ గారు నిన్న రాత్రి ధమ్కీ ట్రైలర్ 1.0 ను విడుదల చెయ్యడం జరిగింది. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ సినిమాకు ఆయనే డైరెక్టర్ గా కూడా వ్యవహరించారు. నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తుంది. లవ్, ఫ్యామిలీ, ఎమోషన్స్, మాస్, యాక్షన్ ఇలా అన్ని రకాల కమర్షియల్ మాస్ హంగులతో కూడిన ఈ ట్రైలర్ కు ఆడియన్స్ నుండి చాలా మంచి స్పందన వస్తుంది. దీంతో ధమ్కీ ట్రైలర్ యూట్యూబ్ టాప్ #1 ట్రెండింగ్లో దూసుకుపోతుంది. ఇంకా ఒక రోజు కూడా పూర్తి కాకముందే ఈ ట్రైలర్ కు 1.6 మిలియన్ వ్యూస్, 107లైక్స్ వచ్చాయి.
వణ్మయి క్రియేషన్స్, VS సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమా విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa