పవన్ కళ్యాణ్ రాజకీయ పర్యటనలు చేస్తూనే మరోవైపు సినిమాల చిత్రీకరణ పూర్తిచేస్తున్నారు. ఆయన చిత్రం హరిహర వీరమల్లు షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా సాగుతుంది.ఫైట్ మాస్టర్ విజయ్ పోరాట ఘట్టాల్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను వేసవికి విడుదల చేయడమే లక్ష్యంగా షూటింగ్ చేస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ కు జోడీగా నిధి అగర్వల్ నటిస్తుండగా, సన్నీ డియోల్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు.