తాను ఒకానొక సమయంలలో పానీపూరీతో ఆకలి తీర్చుకునేవాడినని బిగ్ బీ అమితాబ్ వెల్లడించారు. ‘కౌన్ బనేగా కరోడ్ పతి’14వ సిరీస్ లో భాగంగా తన జీవితంలో ఆకలి సంక్షోభం ఎదుర్కున్న రోజులు గుర్తు చేసుకున్నారు. విక్టోరియా మెమోరియల్ ముందు ప్రపంచంలోనే ఉత్తమ పానీపూరీ లభించే ప్రాంతం ఉందని.. అప్పట్లో నెలకు రూ.300-రూ.400 సంపాదించే తన లాంటి వారికి అది చిరునామా అని చెప్పారు. అప్పుడే పానీపూరీ ఒక్కటే చౌకగా, రుచిగా ఉండేదని వాటితోనే ఆకలి తీర్చుకున్నట్లు పేర్కొన్నారు.