ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిఖిల్ సిద్దార్థ్ "18 పేజెస్" మ్యూజికల్ ప్రమోషన్స్ షురూ..!!

cinema |  Suryaa Desk  | Published : Fri, Nov 18, 2022, 12:46 PM

యంగ్ హీరో హీరోయిన్లు నిఖిల్ సిద్దార్ధ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న చిత్రం "18 పేజెస్". విశేషమేంటంటే ఈ సినిమా కథను టాప్ డైరెక్టర్ సుకుమార్ గారు అందించారు. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ పల్నాటి సూర్యప్రతాప్ డైరెక్ట్ చేసారు. ఈయన గతంలో సుశాంత్ తో కరెంట్, రాజ్ తరుణ్ తో కుమారి 21F చిత్రాలను డైరెక్ట్ చేసారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది.


లేటెస్ట్ గా 18 పేజెస్ మూవీ టీం మ్యూజికల్ ప్రమోషన్స్ ను షురూ చేసింది. ఈ మేరకు ఫస్ట్ సింగిల్ 'నన్నయ రాసిన' లిరికల్ సాంగ్ నవంబర్ 22న విడుదల చేస్తామని మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు. గోపిసుందర్ ఈ సినిమాకు సంగీతం అందించారు.


పోతే, ఈ చిత్రం డిసెంబర్ 23న గ్రాండ్ రిలీజ్ కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa