ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ZEE5లో ప్రసారానికి అందుబాటులోకి వచ్చిన రాజ్ తరుణ్ 'అహ నా పెళ్లంట'

cinema |  Suryaa Desk  | Published : Thu, Nov 17, 2022, 06:52 PM

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ ZEE5 ప్రకటించిన ప్రాజెక్ట్‌పై సంతకం చేసి OTT ప్లాట్ఫారంలోకి ఎంట్రీ సంగతి అందరికి తెలిసిన విషయమే. ఈ షోకి 'అహ నా పెళ్లంట' అనే టైటిల్ ని మేకర్స్ ఖరారు చేసారు. ZEE5 అండ్ తమడ మీడియాఈ వెబ్ సిరీస్ ని నిర్మిస్తుంది. సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో ఈ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్‌లో రాజ్ తరుణ్ శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రలు పోషించారు.


ఈ సిరీస్ ZEE5లో 16వ అర్ధరాత్రి నుండి ప్రీమియర్‌గా ప్రసారానికి అందుబాటులోకి వచ్చింది. 8 ఎపిసోడ్‌లు కలిగి ఉన్న ఈ వెబ్ సిరీస్ లో ఆమని, హర్షవర్ధన్, పోసాని కృష్ణ మురళి, గెటప్ శ్రీను, జబర్దష్ రాజమౌళి, తాగుబోతు రమేష్, మధునందన్, భద్రమ్ మరియు రఘు కరమంచి, దొరబాబు కీలక పాత్రలలో నటిస్తున్నారు. రాహుల్ తామాడ, సాయిదీప్‌రెడ్డి బుర్రా ఈ సిరీస్‌ని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa