రేపు థియేటర్లలో విడుదల కాబోతున్న "అలిపిరికి అల్లంతదూరంలో" సినిమా నుండి మా తిరుపతి వీడియో సాంగ్ విడుదలైంది. ముందుగా రిలీజైన మా తిరుపతి లిరికల్ సాంగ్ కి ప్రేక్షకాభిమానుల నుండి విశేష స్పందన వచ్చింది. ఈ పాట లిరిక్స్ లో, పిక్చరైజషన్ లో తిరుపతి ఘనచరిత్ర, పవిత్రత, తిరుపతి నగర అందమైన ప్రదేశాలను చూడవచ్చు, ఇంకా వినవచ్చు కూడా. ఈ పాటను లెజెండరీ సింగర్ కం మ్యూజిక్ డైరెక్టర్ శంకర్ మహదేవన్, రమ్య బెహరా ఆలపించారు. ఫణి కళ్యాణ్ సంగీతం అందించారు. కిట్టు విస్సాప్రగడ లిరిక్స్ అందించారు.
కాస్కేడ్ పిక్చర్స్ పతాకంపై రమేష్, రాజేంద్ర రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు ఆనంద్ డైరెక్టర్. రావణ్ నిట్టూరు, నిఖిత హీరోయిన్లుగా నటిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa