కొత్త దర్శకుడు, కొత్త నటీనటులతో తెరకెక్కిన చిత్రం "అలిపిరికి అల్లంతదూరంలో". డైరెక్టర్ నందిని రెడ్డి వద్ద అసిస్టెంట్ గా పని చేసిన ఆనంద్ జే దర్శకుడిగా మారి చేస్తున్న తొలి చిత్రమిది. ఈ చిత్రంతో రావణ్ నిట్టూరు, నిఖితా అలిశెట్టి తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోహీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు.
కాస్కేడ్ పిక్చర్స్ పతాకంపై రమేష్, రాజేంద్ర రెడ్డి నిర్మిస్తున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ కు ఫణి కళ్యాణ్ సంగీతం అందించారు. రీసెంట్గా రిలీజైన ట్రైలర్ కంటెంట్ పరంగా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించడంతో సినిమాపై చాలా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. పోతే, ఈ సినిమా రేపే ఇరు తెలుగు రాష్ట్రాలలోని థియేటర్లలో అడుగు పెట్టబోతోంది. ఈ చిత్రం సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం స్పెషల్ వీడియోను విడుదల చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa