ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'RRR' జపాన్‌ బాక్స్ఆఫీస్ లేటెస్ట్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Wed, Nov 16, 2022, 06:51 PM

SS రాజమౌళి డైరెక్షన్ లో టాలీవుడ్ స్టార్ హీరోస్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'RRR' సినిమా థియేటర్లలో విడుదలై ఘన విజయాన్ని సాధించింది. ఈ మూవీ విడుదలైన అన్ని చోట్ల సాలిడ్ కలెక్షన్స్ ని రాబటింది. తాజాగా ఈ సినిమాను జపాన్‌లో విడుదల చేయడంతో పాటు ఈ చిత్ర ప్రీమియర్‌కి స్టార్ కాస్ట్ కూడా హాజరైన సంగతి తెలిసిందే.


తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా జపనీస్ బాక్సాఫీస్ వద్ద ఇప్పటి వరకు $1,715,810 వసూలు చేసింది. ఇండస్ట్రీ ట్రాకర్ రమేష్ బాలా ట్విట్టర్‌లో ఒక పోస్ట్‌ను షేర్ చేసి ఇదే విషయాన్ని ప్రకటించారు. పాజిటివ్ మౌత్ టాక్ స్ప్రెడ్ కావడంతో ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది.


ఈ యాక్షన్ డ్రామా మూవీలో అలియా భట్, సముద్రఖని, అజయ్ దేవగన్, శ్రియా శరణ్, ఒలివియా మోరిస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని డివివి దానయ్య భారీ స్థాయిలో నిర్మించారు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa