ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్, కియారా అద్వానీ ఓ భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్నవిషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో ఓ పాట చిత్రీకరణ కోసం రూ.15 కోట్లు ఖర్చు చేస్తున్నారని సమాచారం. ఈ భారీ బడ్జెట్ పాటను నవంబరు 20 నుంచి డిసెంబరు 2 వరకు జరిగే షెడ్యూల్ లో చిత్రీకరించనున్నారు. దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.