కోలీవుడ్ స్టార్ విజయ్ మేనియా ఇప్పుడు యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. ఆయన హీరోగా నటించిన ‘వారిసు’లోని ఫస్ట్ సింగిల్ ‘రంజితమే’ 5 కోట్ల వ్యూస్, 18 లక్షల లైక్స్ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ సరికొత్త పోస్టర్ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ ట్రెండింగ్ లో మూడో స్థానంలో ఉంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని తెలుగులో ‘వారసుడు’ పేరిట విడుదల చేయనున్నారు.