తనపై, తన భర్తపై, తన ఉద్యోగిపై నమోదైన చీటింగ్ కేసును కొట్టివేయాలని సన్నీలియోన్ కేరళ హైకోర్టును ఆశ్రయించింది. నాలుగేళ్ల క్రితం ఓ ఈవెంట్ లో పాల్గొనేందుకు సన్నీకి లక్షలు చెల్లించానని, అయినా ఆమె హాజరు కాలేదని ఈవెంట్ మేనేజర్ శియాస్ కుంజు మహమ్మద్ కేసు దాఖలు చేశారు. ఇవన్నీ అసత్యాలని, తాను, తన భర్త, తన ఉద్యోగికి దీంతో ఎలాంటి సంబంధం లేదని, ఇందుకు సంబంధించి ఎలాంటి ఆధారాలూ లేవని సన్నీ తన పిటిషన్ లో పేర్కొంది.