నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీ వేదికగా 'అన్ స్టాపబుల్' పేరిట ఓ కార్యక్రమం ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రసారం కానున్న 4వ ఎపిసోడ్ లో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సురేశ్ రెడ్డిలు అతిథులుగా హాజరు కానున్నారు. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా, ఫొటోలను ఆహా మంగళవారం రాత్రి విడుదల చేసింది. ఈ ఎపిసోడ్ ఈ నెల 18 నుంచి ప్రసారం కానున్నట్లు ఆహా తెలిపింది.