కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార, మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ కలిసి నటించిన చిత్రం "గోల్డ్". ఆల్ఫోన్స్ పుత్రేన్ డైరెక్షన్లో కామెడీ డ్రామాగా రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ లోనే విడుదల కావాల్సి ఉండగా, అనుకోని కారణాల వల్ల వాయిదా పడింది. కానీ, ఇప్పటివరకు ఈ చిత్రబృందం నుండి విడుదల తేదిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు.
తాజాగా డిసెంబర్ 2వ తేదీన తమిళం, మలయాళ భాషలలో ఈ సినిమాను గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ఈమేరకు త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa