భారీ స్టార్ క్యాస్ట్ తో, భారీ బడ్జెట్టుతో, అద్భుతమైన దృశ్యకావ్యంగా తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్ రీసెంట్గా రిలీజై పాన్ ఇండియా ప్రేక్షకులను విశేషంగా అలరించింది. క్రియేటివ్ డైరెక్టర్ మణిరత్నం డ్రీం ప్రాజెక్ట్ గా రూపొందబడిన ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కింది. మొదటి భాగానికి ప్రేక్షకుల నుండి చాలా మంచి స్పందన రావడంతో రెండవ భాగంపై భారీ అంచనాలున్నాయి.
ఆల్రెడీ పార్ట్ 2 చిత్రీకరణ చాలావరకు పూర్తయిందని తెలుస్తుంది. ఇక మిగిలిన షూటింగ్ ను పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరిపి ఈ చిత్రాన్ని అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2 విడుదల తేదీపై మీడియాలో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. అదేంటంటే, వచ్చే ఏడాది ఏప్రిల్ 28వ తేదీన PS 2 విడుదల కాబోతుందని టాక్. త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa