ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తారక్ - ప్రశాంత్ నీల్ మూవీపై లేటెస్ట్ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Tue, Nov 15, 2022, 06:25 PM

జూనియర్ ఎన్టీయార్ కెరీర్ లో 31వ సినిమాను కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో చెయ్యబోతున్న విషయం తెలిసిందే కదా. తారక్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటింపబడి, ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదలైంది. ఈ పోస్టర్ లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ మాస్ తారక్ మనకు కనిపిస్తారు. ఇక, సినిమాలో తారక్ ఊర మాస్ అవతార్ ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే గూజ్ బంప్స్ వస్తున్నాయి.


తాజా సమాచారం ప్రకారం, ఈ ప్రాజెక్ట్ తెలుగు, కన్నడ ద్విభాషాచిత్రంగా తెరకెక్కబోతుందట. మిగిలిన భాషల్లో అనువదింపబడి పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందట. జూనియర్ ఎన్టీఆర్ మాతృభాష కన్నడం కావడంతో, ఆభాషలో తారక్ అలవోకగా మాట్లాడగలరు. దీంతో తారక్ చేతనే ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పించాలని ప్రశాంత్ భావిస్తున్నాడట. అయినా, ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి చాలా సమయమే పడుతుంది కాబట్టి, ఇప్పుడప్పుడే ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ అప్డేట్స్ రాకపోవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa