కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార అల్ఫోన్స్ పుత్రేన్ దర్శకత్వంలో ఒక సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాకి 'గోల్డ్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. గతంలో మూవీ మేకర్స్ ఈ చిత్రం సెప్టెంబర్ 15, 2022న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ, వివిధ కారణాల వల్ల ఈ సినిమా విడుదల మళ్ళి వాయిదా పడినట్లు సమాచారం.
తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రాన్ని డిసెంబర్ 2న విడుదల చేసేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ విషయం గురించి మూవీ టీమ్ నుండి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. కామెడీ-డ్రామా ట్రాక్ లో రానున్న ఈ సినిమాలో అజ్మల్ అమీర్, కృష్ణ శంకర్, శబరీష్ వర్మ తదితరులు సహాయక పాత్రల్లో కనిపించనున్నారు. పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ మరియు మ్యాజిక్ ఫ్రేమ్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రానికి రాజేష్ మురుగేశన్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa