నవంబర్ 18న విడుదల కాబోయే సినిమాలలో ఆనంద్ జే డైరెక్ట్ చేసిన "అలిపిరికి అల్లంతదూరంలో" కూడా ఒకటి. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో రేపు JRC కన్వెన్షన్స్ లో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ కిరణ్ అబ్బవరం ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా హాజరు కాబోతున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదలైంది. మరి, సూపర్ స్టార్ కృష్ణగారి ఆకస్మిక మరణంతో రేపు టాలీవుడ్ సెలవుదినంగా ప్రకటింపబడిన నేపథ్యంలో ఈ ఈవెంట్ జరుగుతుందో లేదో తెలియాల్సి ఉంది.
ఈ సినిమాలో రావణ్ నిట్టూరు, నిఖిత జంటగా నటించారు. రమేష్, రాజేంద్ర రెడ్డి నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa