సూపర్ స్టార్ కృష్ణగారి మృతిపట్ల టాలీవుడ్ సినీపరిశ్రమలో ప్రతి ఒక్కరు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. 79 ఏళ్ళ వయసులో అనారోగ్యం కారణంగా ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచిన కృష్ణగారికి పలువురు సినీ ప్రముఖులు నివాళి సమర్పిస్తున్నారు.
ఈ నేపథ్యంలో నటసింహం నందమూరి బాలకృష్ణగారు నటిస్తున్న కొత్త చిత్రం "వీరసింహారెడ్డి" చిత్రబృందం కలిసి సెట్స్ లోనే కృష్ణగారికి ఘననివాళిని సమర్పించినట్టు తెలుస్తుంది. డైరెక్టర్ గోపీచంద్ మలినేని, కన్నడ నటుడు, ఈ సినిమాలో విలన్ పాత్ర పోషిస్తున్న దునియా విజయ్, తదితరులు కృష్ణగారి చిత్రపటానికి పువ్వులు సమర్పించి నివాళి తెలియచేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa