పాకిస్థానీ క్రికెట్ ఆటగాడు షోయబ్ మాలిక్ ను ప్రేమించి పెళ్లి చేసుకుని ఇండియా వైడ్ హాట్ టాపిక్ గా మారిన టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా చాన్నాళ్ల తదుపరి మరొకసారి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది.
కొన్ని రోజులుగా సానియా - షోయబ్ ల విడాకుల గురించిన వార్తలు మీడియాలో జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరూ కలిసి "ది మీర్జా మాలిక్ షో" పేరిట ఒక టాక్ షోను ఎనౌన్స్ చేసారు. ఉర్దూ ఫ్లిక్స్ లో త్వరలోనే స్ట్రీమింగ్ కు రాబోతున్న ఈ షో ప్రమోషన్స్ లో భాగంగా వీరిద్దరి విడాకుల విషయం మీడియాలో బాగా వైరల్ అయ్యిందని చాలా మంది అనుకుంటున్నారు. ఒకపక్క విడాకుల వార్తలు, మరొక పక్క ఇద్దరూ కలిసి టాక్ షో నిర్వహించడం... ఇందులో ఏది నిజం అనేది వాళ్లిద్దరే క్లారిటీ ఇవ్వాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa