సాయి కిరణ్ దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం "మసూద". తిరువీర్ రెడ్డి, గంగోత్రి చైల్డ్ ఆర్టిస్ట్ కావ్యా కళ్యాణ్ రామ్ జంటగా నటిస్తున్న ఈ సినిమా నవంబర్ 18న థియేటర్లలో విడుదల కాబోతుంది. హీరోయిన్ సంగీత ఈ సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నారు.
విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ మసూద మూవీ టీం కు బెస్ట్ విషెస్ తెలియచేసారు. ఈ మేరకు మసూద టీంతో కలిసి విజయ్ ఫోటో దిగారు. మసూద థియేట్రికల్ ట్రైలర్ కూడా విజయ్ చేతుల మీదుగానే విడుదల అయ్యింది.
ఈ సినిమాను ప్రముఖ టాలీవుడ్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు గారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. స్వధర్మ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో మూడవ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాకు ప్రశాంత్ విహారి సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa