ట్రెండింగ్
Epaper    English    தமிழ்

షూటింగ్ పూర్తి చేసుకున్న అశ్విన్ 'హిడింభ'

cinema |  Suryaa Desk  | Published : Mon, Nov 14, 2022, 05:19 PM

జత కలిసే, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్, రాజు గారి గది 3 వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో అశ్విన్ బాబు ఇప్పుడు మరొక క్రేజీ సినిమాతో ప్రేక్షకులని అలరించడానికి సిద్దమవుతున్నాడు. అనీల్ కన్నెగంటి దర్శకత్వంలో హై ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'హిడింభ' అనే  టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేసినట్లు అధికారకంగా ప్రకటించారు. త్వరలోనే ట్రైలర్‌ను కూడా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.


నందితా శ్వేత ఈ సినిమాలో పోలీస్‌గా కనిపించింది అని సమాచారం. సుభలేఖ సుధాకర్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. SVK సినిమాస్ బ్యానర్‌పై గంగపట్నం శ్రీధర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి వికాస్ బాదిసా సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa