నిర్మాత సాజిద్‌ఖాన్‌పై సినీ నటి షీలా ప్రియా సేథ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్‌కు తగ్గట్లు తన రొమ్ములు లేవని, పెద్దవి అయ్యేందుకు సర్జరీ చేయించుకోవాలని సూచించాడని పేర్కొంది. తన ప్రైవేట్ పార్ట్స్ వైపు అదే పనిగా చూసేవాడని, అవి పెద్దవి అయ్యేందుకు ప్రత్యేక ఆయిల్స్ వాడాలని సూచించాడని తెలిపింది. నిర్మాత సాజిద్ ఖాన్ 2008లో తనతో ఇలా ప్రవర్తించాడని, అతడి వ్యాఖ్యలు తనను భయపెట్టాయని చెప్పింది.