యష్ పూరి హీరోగా పరిచయమవుతున్న చిత్రం "చెప్పాలని ఉంది". ఇందులో స్టెఫీనా పటేల్ హీరోయిన్ గా నటిస్తుంది. హామ్స్ టెక్ ఫిలిమ్స్ తో కలిసి సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీని అరుణ్ భారతి L డైరెక్ట్ చేస్తున్నారు. అస్లాం కెయి సంగీతం అందిస్తున్నారు.
కొంతసేపటి క్రితం ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. ఇందులో హీరో పాత్ర పేరు చంద్రశేఖర్. మాతృ భాషంటే విపరీతమైన అభిమానం. కానీ, తను ఎక్కువగా ప్రేమించే మాతృభాషా తన నుండి దూరమైపోతుండడం, దీంతో తనకే తెలియకుండా ఎవ్వరికి అర్ధం కానీ భాషలో మాట్లాడడం చేస్తుంటాడు. మరి , ఈ సమస్యను చందు అధిగమించాడా? చందు తన విచిత్రమైన భాషతో ఏం చెప్పాలనుకుంటున్నాడో తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa