పొన్నియిన్ సెల్వన్ పాన్ ఇండియా మూవీ నుండి కొంచెంసేపటి క్రితమే "పొన్ని నది" వీడియో సాంగ్ విడుదలైంది. బ్యూటిఫుల్ విజువల్స్, పొన్ని నది అందాలతో ఈ పాట విజువల్ గా గ్రాండియర్ గా, మనసుకు ఆహ్లాదం కలిగించేలా ఉంది. AR రెహమాన్ స్వరపరిచిన ఈ పాటను అన్ని భాషల్లో ఆయనే పాడారు.
మణిరత్నం డ్రీం ప్రాజెక్ట్ గా తెరకెక్కిన ఈ సినిమాలో విక్రమ్, కార్తీ, ఐశ్వర్యరాయ్, జయం రవి, త్రిష, శోభితా ధూళిపాళ్ల, ప్రభు కీలకపాత్రలు పోషించారు. లైకా ప్రొడక్షన్స్ , మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మించారు. సెప్టెంబర్ 30వ తేదీన పాన్ ఇండియా భాషల్లో విడుదలైన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa