నాన్నా నేను నా బాయ్ ఫ్రెండ్స్, రాజుగారి గది 1,2,3 చిత్రాల ద్వారా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు హీరో అశ్విన్ బాబు. ఆయన నటిస్తున్న కొత్త చిత్రం "హిడింబ". విభిన్నమైన కథాకథనాలతో తెరకెక్కుతున్న ఈ హై ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్ కు అనిల్ కన్నెగంటి డైరెక్టర్.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ మూవీ షూటింగ్ రీసెంట్గానే పూర్తి చేసుకుంది. ఇకపై పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుని, అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సన్నద్ధమవుతోంది.
పోతే, ఈ సినిమాలో నందితా శ్వేతా హీరోయిన్ గా నటిస్తుండగా, మకరంద్ దేశ్ పాండే, శ్రీనివాసరెడ్డి, శుభలేఖ సుధాకర్, రఘు కుంచె, రాజీవ్ కనకాల తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa