'అన్నయ్య' సినిమా తదుపరి మెగాస్టార్ చిరంజీవి, మాస్ రాజా రవితేజ తిరిగి "వాల్తేరు వీరయ్య" సినిమాలో కలిసి నటించబోతున్నారు. ఈ సినిమాకు బాబీ కొల్లి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. శృతి హాసన్, క్యాథెరిన్ ట్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు.
వచ్చే సంక్రాంతికి గ్రాండ్ రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇటీవల విడుదలైన టైటిల్ టీజర్ ఎనౌన్స్మెంట్ ప్రేక్షకాభిమానులను విశేషంగా మెప్పించింది. తాజా సమాచారం ప్రకారం, త్వరలోనే వాల్తేరు వీరయ్య మ్యూజికల్ ప్రమోషన్స్ షురూ కానున్నాయి. ఈ నేపథ్యంలో 'బాస్ పార్టీ' అనే మాస్ మసాలా సాంగ్ రిలీజ్ కి సంబంధించిన అధికారిక ప్రకటన ఈ వారంలోనే రానుందని స్వయంగా ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్న దేవిశ్రీప్రసాద్ తెలిపారు. దీంతో ఈ సాంగ్ అప్డేట్ ఎప్పుడు వస్తుందా అని మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa