రౌడీ హీరో విజయ్ దేవరకొండ కొంచెంసేపటి క్రితమే 'మసూద' థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేసారు. హర్రర్ ఎలిమెంట్స్ తో ఈ ట్రైలర్ ఒక పక్క భయపెడుతూనే మరోపక్క ఆసక్తిని రేకెత్తిస్తుంది. సంగీత, తిరువీర్, కావ్యా కళ్యాణ్ రామ్, శుభలేఖ సుధాకర్, అఖిలా రామ్, సత్యం రాజేష్ కీలకపాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని సాయి కిరణ్ డైరెక్ట్ చేసారు. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై రాహుల్ యాదవ్ నక్కా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రశాంత్ R విహారి సంగీతం అందిస్తున్నారు. నవంబర్ 18న థియేటర్లలో ఈ సినిమా విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa